Chandra Babu | జగన్ వద్ద డబ్బులున్నాయి.. కూటమి వద్ద నీతి ఉంది : చంద్రబాబు
Chandra Babu | అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అమరావతి : అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్(CM Jagan) ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu) పేర్కొన్నారు. తిరుపతి గన్నవరంలో కూటమి తరుఫున నిర్వహించిన ఎన్నికల(Elections) ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గన్నవరం(Gannavaram) లో భారీ వర్షం కురుస్తున్నా వర్షంలోనే బాబు ప్రసంగాన్ని కొనసాగించారు. ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ప్రజల ఆస్తులను జగన్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలో వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను లోబర్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా అడ్డుకుని తిప్పిపంపారని, బ్యాలెట్ పోలింగ్(Ballot Polling) లో నూటికి 90 శాతం మంది ఉద్యోగులు కూటమికే ఓట్లు వేశారని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగస్థులను అభినందించారు.
కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. హలో ఏపీ అంటే.. బైబై జగన్ అంటూ నినాదాలు చేయించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను వీరోచితంగా పోరాడుతున్న యార్లగడ్డ వేంకట్రావుకు భవిష్యత్‌లో సముచిత గౌరవం ఇస్తానని పేర్కొన్నారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

