ఎవరి పాపనో.. వారికేమి కష్టమొచ్చిందో.. పసికందును ఇలా రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో!!
జిల్లాలో కొన్నిరోజులుగా రోడ్డు పక్కన నవజాత శిశువులను పారేయడం, ముళ్ల పొదల్లో పసికందు మృతదేహాలను వదిలివెళ్లడం వంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
- మంటగలుస్తున్న మానవత్వం
- నవజాత శిశువులపై కర్కశత్వం
- రోడ్డు పక్కన, ముళ్ల పొదల్లోకి విసిరేస్తున్నారు..
- జిల్లాలో తరచూ వెలుగుచూస్తున్న ఘటనలు
ఖలీల్వాడి, ఆగస్టు 12: జిల్లాలో కొన్నిరోజులుగా రోడ్డు పక్కన నవజాత శిశువులను పారేయడం, ముళ్ల పొదల్లో పసికందు మృతదేహాలను వదిలివెళ్లడం వంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు పురిటిలోనే బిడ్డలను కాటికి పంపుతున్నారు.. మరికొందరు ముళ్ల పొదల్లోకి విసిరేస్తున్నారు..ఇంకొందరు రోడ్డుపక్కన వదిలేసి జారుకుంటున్నారు.. మానవత్వానికి మచ్చగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి. వివాహేతర సంబంధమో లేదా ఇంకేం బంధమో గానీ నవజాత శిశువులను కన్ను తెరవకముందే వదిలించుకుంటూ మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. ఈ నెల 4న జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద ఉన్న ఓ డ్రైనేజీలో నవజాత శిశువు లభ్యమైంది. ఎవరు వదిలి వెళ్లారో తెలియదు..తాజాగా బుధవారం మోపాల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ పరిధిలోని సిర్పూర్ రోడ్డు పక్కన ఓ శిశువును వదిలేసివెళ్లారు. స్థానికులు గుర్తించి వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఏఎన్ఎం, డబ్ల్యూపీసీ సభ్యులు అక్కడికి చేరుకొని శిశువును ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పురిటిలోనే చిదిమేస్తున్నారు..
వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, డేటింగ్లు మానవ సంబంధాలను మంటగలుపుతున్నాయి. నవ మాసాలు మోసి..కని మొగ్గలోనే పసికందును చిదిమేస్తున్నారు. ఒకవేళ మృతి చెందితే ఖననం చేయాలి కానీ, మురికి కాలువల్లో, ముళ్ల పొదల్లో పడేసి మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానకు నిత్యం 800 నుంచి వెయ్యి మందికి పైగా అవుట్పేషంట్లు వస్తుంటారు. ప్రస్తుతం వందల సంఖ్యలో ప్రసవాల కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 4న డ్రైనేజీలో దొరికిన శిశువు గురించి విచారణ చేపట్టగా, రికార్డుల ప్రకారం ఆ శిశువు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇంతపెద్ద దవాఖానకు మొత్తం 60 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంది. సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా శిశువును వదిలివెళ్లిన వారీ ఆచూకీ లభించకపోవడం గమనార్హం. పురిటిలోనే చిన్నారులను చిదిమేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

