Yevam Movie | పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భరత్‌రాజ్… ‘యేవమ్’ నుంచి కొత్త లుక్ విడుదల
Yevam | యువ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘యేవమ్’ అనే సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Yevam | యువ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘యేవమ్’ అనే సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాందిని చౌదరితో పాటు ఆషురెడ్డి ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అభిరామ్‌గా కనిపించనున్న భరత్‌రాజ్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. పోలీస్ గెటప్‌లో గన్ను ఎయిమ్ చేస్తూ అతని లుక్ కనబడుతుంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. ఈ రోజు విడుదల చేసిన అభిరామ్ లుక్ కూడా అందరిని అలరిస్తుంది. ఈ పాత్రలో కూడా డిఫరెంట్ షేడ్స్ వుంటాయి. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కీర్తన శేషు, సినిమాటోగ్రాఫర్ ఎస్వీ విశ్వేశ్వర్, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

