Love Mouli Movie | సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నవదీప్ ‘లవ్ మౌళి’.. రిలీజ్ ఎప్పుడంటే.?
Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం. ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది.
Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం. ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నవదీప్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాడని అభిమానులంతా నవదీప్‌ను కొత్తగా చూస్తారని దర్శకుడు తెలిపాడు. నా లైఫ్‌లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవల్లో ప్రేమించేవాడిని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ వున్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ, జూన్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విభిన్న ప్రేమకథలు కోరుకునే ప్రేక్షకులందరికి మా లవ్, మౌళి మనసులకు హత్తుకుంటుంది అన్నారు
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
రచన -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాటల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

