Brij Bhushan | బ్రిజ్ భూషణ్‌కు షాక్.. లైంగిక వేధింపులపై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan) ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు తేల్చింది. మే 21న బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఆరో కేసును కొట్టివేసింది.
కాగా, బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదుకు సంబంధించిన తీర్పును ఏప్రిల్ 18న ఢిల్లీ కోర్టు వెల్లడించాల్సి ఉంది. అయితే 2022 సెప్టెంబర్ 7న డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయానికి తాను హాజరైనట్లుగా వచ్చిన నివేదికలపై విచారణ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మే 7న తీర్పు వెల్లడించాలని కోర్టు నిర్ణయించింది.
మరోవైపు ఉత్తర్వుల పరిశీలన తుది దశలో ఉండటంతో మే 10న తీర్పు ప్రకటిస్తామని మే 7న కోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు శుక్రవారం తుది తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

