Wine Shops | ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటే ఎన్నికలు ముగిసేంత వరకు రెండు రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.