Darling | బలగం ఫేమ్ టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మగా మారిన భర్తల స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌కు తాజాగా గుమ్మడికాయ కొట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
It’s a wrap for #Darling
👉🏻https://t.co/g4fbvvlxbH pic.twitter.com/CqRuoesrtx
— Vamsi Kaka (@vamsikaka) May 10, 2024