సిటీబ్యూరో, మే10 (నమస్తే తెలంగాణ) : అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)తో టీ హబ్(T -hub) జత కట్టింది. ప్రారంభించిన వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను స్టార్టప్ వ్యవస్థాపకులకు బోధించేందుకు ‘ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్’ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
సాంప్రదాయ వ్యాపార సంస్థల నిర్వహణ విధానాల స్థానంలో కొత్తగా అవలంభించాల్సిన పద్ధతులపై ఔత్సాహిక వ్యాపార వేత్తలకు శిక్షణ ఉంటుందని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఇందులో మాస్టర్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, స్ట్రాటజీ, ఎనలిటిక్స్ వంటి అంశాల్లో ఆస్కీకి చెందిన నిపుణులతో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టీ హబ్‌ను సంప్రదించాలని సూచించారు.