గురువారం 04 జూన్ 2020
Telangana - May 15, 2020 , 11:46:40

చిరుత కోసం వేట.. ఎవరూ భయపడవద్దు: డీసీపీ ప్రకాశ్‌రెడ్డి

చిరుత కోసం వేట.. ఎవరూ భయపడవద్దు: డీసీపీ ప్రకాశ్‌రెడ్డి

హైదరాబాద్‌: చిక్కినట్టే చిక్కిన చిరుతుపులి తప్పించుకుంది. చిరుతను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్‌ 26 గంటలుగా కొనసాగుతున్నది. నిన్న హైదరాబాద్‌ నగర శివార్లలోని కాటేదాన్‌ సమీపంలో రోడ్డుపై సంచరించిన చిరుతపులి, మత్తు మందు ఇచ్చేలోపే పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి పారిపోయింది. చిరుత కదలికలను గుర్తించడానికి ఫాంహౌస్‌లో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా దాని జాడలు కన్పించలేదు. ఫాంహౌస్‌లో దాని అడుగుజాడలను గుర్తించిన అధికారులు అది గోడ దూకి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. వ్యవసాయ వర్సిటీలోని దట్టమైన చెట్ల మధ్యలో నుంచి వెళ్లిన చిరుత, గగన్‌పహాడ్‌ అటవీ, హిమాయత్‌సాగర్‌ చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. పులి అడుగుజాడల ద్వారా అది ఎక్కడికి వెళ్లిందో గుర్తిస్తున్నామని శంషాబాద్‌ డీసీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఎవరూ భయపడొద్దని, పులిని తప్పనిసరిగా పట్టుకుంటామని ఆయన చెప్పారు. 


logo