శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 18:44:08

గోవాలో మూడురోజులు కఠిన లాక్‌డౌన్‌

గోవాలో మూడురోజులు కఠిన లాక్‌డౌన్‌

పనాజీ : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ విధించింది. నేటి నుంచి ఈ నెల 20 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుండగా తొలిరోజు జనాల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. తీరప్రాంతాలతోపాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎవ్వరూ తిరగకుండా నియంత్రించారు.

తీర ప్రాంతాలు, నగరంలో రాష్ట్ర పోలీసులు లాక్‌డౌన్‌ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారని, తాము పబ్లిక్‌ ప్రదేశాల్లో జనాలు, వాహనాలు సంచరించకుండా నియంత్రిస్తున్నామని నార్త్‌ గోవా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ఉతృష్ట్‌ ప్రసూన్‌ తెలిపారు. నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా సరిహద్దులో పలుశాఖల అధికారులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యక్తిగత ప్రయాణాలు, అత్యవసరం కాని సేవలను నిలిపివేస్తూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగష్టు 10 వరకు రాష్ట్రంలో ఈ జనతా కర్ఫ్యూ కొనసాగనుంది.
 
logo