మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 12:30:53

శివుని గుడిలో ప‌దడుగుల రాచ‌నాగు!

శివుని గుడిలో ప‌దడుగుల రాచ‌నాగు!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ నాగుపాము క‌ల‌క‌లం సృష్టించింది. పది అడుగుల పొడ‌వుగ‌ల‌ ఓ రాచనాగు బెహ్రాంపూర్‌లోని నందికేశ్వ‌ర‌ ఆలయంలోకి దూరింది. గురువారం రాత్రి ప‌దిన్న‌ర స‌మ‌యంలో జ‌‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు భయాందోళ‌న‌కు గుర‌య్యారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న అట‌వీ అధికారులు పామును ర‌క్షించి స‌మీప అడ‌విలో వ‌దిలేశారు.

'రాత్రి 10:30 సమయంలో ఓ స్థానికుడు మాకు ఫోన్ చేశారు. బెహ్రాంపూర్‌లోని నందీకేశ్వర ఆలయంలోకి కింగ్ కోబ్రా ప్రవేశించింద‌ని చెప్పారు. దాంతో ఫారెస్ట్ రేంజర్‌ సహా ఓ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని స‌మీప అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టారు' అని అటవీశాఖ అధికారి శ్రీకాంత్ నాథ్ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo