పరదా వెనక కథ
‘టిల్లు స్కేర్' చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకుంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ భామ మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ‘పరదా’ చిత్రంలో నటిస్తున్నది.
‘టిల్లు స్కేర్’ చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకుంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ భామ మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ‘పరదా’ చిత్రంలో నటిస్తున్నది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్ వీడియోను శుక్రవారం అగ్ర నాయిక సమంత, దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే విడుదల చేశారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో సంప్రదాయ లంగా వోణిలో కనిపిస్తున్నది అనుపమ పరమేశ్వరన్. కాన్సెప్ట్‌లో వీడియోలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే ప్రసిద్ధ శ్లోకం వినిపిస్తున్నది. దీనిని బట్టి స్త్రీ ఆత్మగౌరవాన్ని చాటే కథాంశమిదని అర్థమవుతున్నది. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే బలమైన భావోద్వేగాలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నామని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లే కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్ సేన్, సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

