Shruti Haasan | ప్రేమ బంధానికి గుడ్‌బై? శాంతను హజారికాతో శృతిహాసన్ బ్రేకప్
అగ్ర కథానాయిక శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ముంబయి సినీ వర్గాలు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
Shruti Haasan | అగ్ర కథానాయిక శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ముంబయి సినీ వర్గాలు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తన లవ్‌ఎఫైర్‌పై శృతిహాసన్ బహిరంగంగా ఎప్పుడూ స్పందించనప్పటికీ..ప్రియుడితో తీయించుకున్న ఫొటోలను తరచుగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేది. ఈ జంట ముంబయిలో సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ జంట విడిపోయినట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారని, పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి గుడ్‌బై చెప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ ప్రేమజంట సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. ‘ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఇతరులనూ అర్థం చేసుకున్నా’ అంటూ శృతిహాసన్ పెట్టిన పోస్ట్ కూడా వారి బ్రేకప్ను నిర్ధారిస్తున్నదని అమె అభిమానులు అంటున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే ప్రేమికులిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు. ఇక కెరీర్‌పరంగా శృతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం డెకాయిట్, చెన్త్నె స్టోరీ చిత్రాల్లో శృతిహాసన్ నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

