Apollo Health | చెన్నై, ఏప్రిల్ 26: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.2,475 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
అపోలో హెల్త్‌కో, కైమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన హోల్‌సేల్ ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు 12.1 శాతం వాటా దక్కింది. వచ్చే రెండు నుంచి రెండున్నరేండ్లలో ఈ వాటాను 100 శాతానికి పెంచుకునే అవకాశం కూడా ఉన్నది.