MI vs SRH : టాస్ ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(11), ట్రావిస్ హెడ్(33)లు శుభారంభమిచ్చారు. బుమ్రా, తుషారలు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఇద్దరూ వికెట్ ఇవ్వలేదు. అరంగేట్రం పేసర్ కంబోలిని టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదుతున్నారు.
కంబోలి ఐదో ఓవర్లో హెడ్ బౌల్డయ్యాడు. అయితే.. అది నో బాల్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 5 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ పడకుండా 55 రన్స్ చేసింది.