బూర్గంపహాడ్, అక్టోబర్ 03 : తురకకాశ కార్మికుల కోసం జనరేటర్ స్కీమ్‌ను అమలు చేయాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి సంఘ నాయకులతో కలిసి శనివారం కలెక్టర్ కార్యాలయంలో బీఎండబ్ల్యూవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. జనరేటర్ స్కీంకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చండ్రుగొండ, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, అశ్వాపురం నాలుగు మండలాలకు చెందిన అర్హులైన తురకకాశ కార్మికులకు త్వరితగతిన జనరేటర్లను పంపిణీ చేయాలని కోరారు. అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తురకకాశ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.