IAF | ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విమాన యుద్ద విన్యాసాల రెండో ఎడిషన్ తరంగ్ శక్తి 2026ను రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైమానిక దళాలకు చెందిన విమానాల భాగస్వామ్యంతో స్నేహభావానికి ప్రతీకగా చేపడుతున్నారు. ఈ విన్యాసాల థీమ్ ‘పవర్ ఇన్ పార్ట్నర్షిప్, ట్రస్ట్ ఇన్ ది స్కై’.
ఈ విన్యాసాలు సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ విన్యాసాల్లో యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, గ్రీస్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్ పాల్గొంటున్నాయి. ఇంకో 32 దేశాలు ఈ విన్యాసాలను పరిశీలిస్తున్నాయి.

Excersize
అమెరికాకు చెందిన ఐదో జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ US Air Force’s F-35A Lightning II యుద్ధ విమానం ఈ విన్యాసాల్లో పాల్గొనడం విశేషం. ఈ విమానం భారత వైమానిక స్థావరం నుంచి భారత వైమానికి దళంతో కలిసి ఒక విన్యాసంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళ అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్ SU-30MKIచ మిరేజ్ 2000, జాగ్వార్, MiG-29, ఇండిజినస్ LCA తేజ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అలాగే విదేశాలకు చెందిన ఫ్రెంచ్ రఫేల్ ఫైటర్స్, A400M ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, MRIT ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, యూఏఈ F-16s, జర్మనీ యూరోఫైటర్స్ టైఫూన్స్ యుద్ధ విమానాలు కూడా ఆకర్షణగా నిలిచాయి.
వివిధ దేశాల మధ్య వాయుసేనల పరస్పర సహకారం మెరుగుపరచడం, సంయుక్త వ్యూహాత్మక పోరాటం, వాయు రక్షణ, ఆకాశంలోనే ఇంధనం నింపుకోవడం భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడం ఈ విన్యాసాల ఉద్దేశం అని వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ పేర్కొన్నారు.