IND vs PAK : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఆ ఆసక్తే వేరు. నువ్వానేనా అన్నట్టు సాగే పోరులో ఎప్పటిలానే మళ్లీ మన జట్టుదే పైచేయి. నిరుడు ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా ఈసారి ఆసియా క్రీడల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. అంతర్జాతీయ టీ20ల్లో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ వరస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి ప్రపంచకప్ ఫైనల్ నుంచి నేడు ఆసియాడ్ పసిడి పోరు వరకూ రెచ్చగొట్టేలా ప్రవర్తించే పాక్‌కు ఛాంపియన్ ఆటతో గట్టి బుద్ది చెప్పింది మెన్ ఇన్ బ్లూ.
అంతర్జాతీయ టీ20ల్లో అజేయశక్తిగా అవతరించిన భారత పురుషుల జట్టు మళ్లీ ట్రాక్‌లో పడింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డపై క్వీన్స్లీప్ అవమానాల నుంచి తేరుకుంటూ జింబాబ్వేపై జయభేరి మోగించిన టీమిండియా.. ఆసియా క్రీడల్లో జూలు విదిల్చింది. శనివారం ఫైనల్ పోరులో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ అదిరే ఆటతో పాకిస్థాన్‌ను ఓడించి వరసగా రెండో పసిడి పట్టేసింది. నిరుడు ఆసియా కప్ టైటిల్ పోరులో అర్ధ శతకంతో దాయాది ఆశల్నీ ఆవిరి చేసిన తిలక్ వర్మ(51).. ఈసారీ టీమిండియా హీరో అయ్యాడు. 19 పరుగుల తేడాతో గెలుపొందిన మెన్ ఇన్ బ్లూ టీ20 ఫైనల్లో పాకిస్థాన్ఫై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.
Tilak Varma 🤝 Shining against Pakistan in a final pic.twitter.com/hmaPbB4VWY
— Cricinfo (@cricinfo) October 3, 2026
పద్దెనిమిదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను భారత జట్టు చిత్తు చేసింది. ఉత్కంఠ పోరులో మిస్బాహుల్ హక్(43) క్యాచ్‌ను శ్రీశాంత్ అందుకోగా తొలి ఎడిషన్ ఛాంపియన్‌గా అవతరించింది ధోనీ సేన. నిరుడు టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లోనూ దాయాదులు ఫైనల్లో ఢీకొన్నాయి. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనలో 20కే మూడు కీలక వికెట్లు పడినవేళ క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. సంజూ శాంసన్(24), శివం దూబే(33)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో రింకూ సింగ్ బౌండరీతో టీమిండియా ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసి తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
India vs Pakistan in T20I tournament finals:
2007 T20 World Cup: 🇮🇳
2025 Asia Cup: 🇮🇳
2026 Asian Games: 🇮🇳 pic.twitter.com/WAtJdhs5ck— Cricinfo (@cricinfo) October 3, 2026
ఇప్పుడు జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లోనూ టీమిండియా పంచ్‌కు పాక్ తోక మూడిచింది. తొలుత ఓపెనర్ అభిషేక్ శర్మ(61), తిలక్ వర్మ(69 నాటౌట్)లు హాఫ్ సెంచరీతో మెరిశారు. ఆపై 212 పరుగుల ఛేదనలో హసన్ నవాజ్(96) రాణించినా దూబే, సుందర్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు తీయడంతో పాక్ 192కే పరిమితమైంది. అంతే.. అంతర్జాతీయంగా మూడు టీ20 ఫైనల్స్‌లోనూ జయభేరి మోగించిన భారత్.. పాక్‌పై ఈ ఫార్మాట్లో వరసగా పదో విజయంతో తమ ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంది.