Vivo Y 18- Y18e | మీడియాటెక్ హెలియో చిప్సెట్తో భారత్ మార్కెట్లోకి వివో వై18 సిరీస్ ఫోన్లు.. రూ.10 వేల లోపు ధరకే లభ్యం..!
Vivo Y 18- Y18e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై18 (Vivo Y18), వివో వై 18ఈ (Vivo Y18e) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo Y 18- Y18e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై18 (Vivo Y18), వివో వై 18ఈ (Vivo Y18e) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో చిప్సెట్ (octa-core MediaTek Helio), వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలు, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ నాచ్ ఫీచర్లతో వచ్చాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ (Android 14-based UI out-of-the-box) ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. గత మార్చిలో సెలెక్టెడ్ మార్కెట్లలో ప్రవేశ పెట్టిన వివో వై03 మోడల్ మాదిరిగానే వివో వై18 (Vivo Y18), వివో వై 18ఈ (Vivo Y18e) ఫోన్ల డిజైన్ ఉంటుంది.
వివో వై18 (Vivo Y18) ఫోన్ రెండు ర్యామ్-రెండు స్టోరేజీ కాన్ఫిగరేషన్లు 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. రెండు కలర్ ఆప్షన్లు జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తాయి.
మరోవైపు వివో వై18ఈ (Vivo Y18e) ఫోన్ సింగిల్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్లో రూ.7,999లకే అందుబాటులో ఉంటుంది. వివో వై18 మాదిరిగానే జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వివో వై18, వివో వై18ఈ ఫోన్లు రెండూ వివో ఈ-స్టోర్‌లోనే లభిస్తాయి.
వివో వై18 (Vivo Y18), వివో వై18ఈ (Vivo Y18e) ఫోన్లు రెండూ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.56- అంగుళాల హెచ్డీ+ (1,612 x 720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 12 ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్సెట్తో వచ్చాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి.
వివో వై18 (Vivo Y18) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్‌తోపాటు 0.08 మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెన్సర్ కలిగి ఉంటుంది. వివో వీ18 ఈ (Vivo Y18e) ఫోన్ 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 0.08-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
వివో వై18, వివో వై18ఈ ఫోన్లు రెండూ 15 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఉంటాయి. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిటెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ ఇచ్చారు. 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

