Best Selling Cars | టాటా పంచ్ ఫస్ట్.. `టాప్-10`లో మారుతి `సప్త పది`..!
Best Selling Cars | గత నెల అమ్ముడైన టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచినా ఏడు మోడల్స్ మారుతి సుజుకివే కావడం ఆసక్తికర పరిణామం.
Best Selling Cars | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తన పట్టు సాధించుకునే దిశగా అడుగులేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల (ఏప్రిల్)లో అమ్ముడైన టాప్-10 కార్లలో ఏడు మారుతి సుజుకివే కావడం ఆసక్తికర పరిణామం. టాప్-10లో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలవగా, హ్యుండాయ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా ఒక్కో మోడల్ చోటు దక్కించుకున్నాయి.
దేశీయ కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీలదే హవా. మారుతి, టాటా, హ్యుండాయ్, మహీంద్రాకు చెందిన కార్ల విక్రయాల్లో ఐదు ఎస్యూవీ కార్లు పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. మరో రెండు హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక సె డాన్, ఒక ఎంపీవీ, ఒక వ్యాన్ టాప్‌లో నిలవగా అవన్నీ మారుతి సుజుకి మోడల్ కార్లే కావడం ఆసక్తికర పరిణామం.
గత నెలలో అమ్ముడైన టాప్ 10 కార్లలో టాటా పంచ్, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి బ్రెజా, మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎకో ఉన్నాయి.
టాటా పంచ్ వరుసగా రెండో నెల బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఏప్రిల్ నెలలో టాటా పంచ్ అత్యధికంగా 19,158 యూనిట్లు విక్రయించింది. తర్వాతీ స్థానంలో నిలిచిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 17,850 యూనిట్లు, మారుతి సుజుకి బ్రె జా 17,113 యూనిట్లతో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఏండ్ల తరబడి అమ్ముడవుతున్న సెడాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి డిజైర్ మూలస్థంభంగా నిలిచింది. గత నెలలో మారుతి డిజైర్ 15,825 యూనిట్లు విక్రయించింది. హ్యుండాయ్ క్రెటా 15,447 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో, స్కార్పియో క్లాసిక్ కలిసి 14,807 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మిగతా నాలుగు టాప్ 10 కార్లూ మారుతి సుజుకివే. మారుతి ఫ్రాంక్స్ 14,286 యూనిట్లు, మారుతి బాలెనో 14,049 యూనిట్లు, ఎంవీపీ సెగ్మెంట్లో ఎర్టిగా 13,544 యూనిట్లు, వ్యాన్ క్యాటగిరీలో ఎకో 12,060 యూనిట్లు విక్రయించింది.
ఏప్రిల్‌లో అమ్ముడైన బెస్ట్ -10 టాప్ కార్లివే
టాటా పంచ్ – 19,158 యూనిట్లు
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ – 17,850 యూనిట్లు
మారుతి సుజుకి బ్రె జా – 17,113 యూనిట్లు
మారుతి సుజుకి డిజైర్ – 15,825 యూనిట్లు
హ్యుండయ్ క్రెటా – 15,447 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో – 14,807 యూనిట్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ – 14,286 యూనిట్లు
మారుతి సుజుకి బాలెనో – 14,049 యూనిట్లు
మారుతి సుజుకి ఎర్టిగా – 13,544 యూనిట్లు
మారుతి సుజుకి ఎకో – 12,060 యూనిట్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

