గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Jan 24, 2020 ,

బహుజన ఆత్మబంధువు

బహుజన ఆత్మబంధువు

ఏ సమాజంలోనైనా, అది సోషలిస్టు సమాజమైనా చదువుకున్న వారికందరికీ లేదా పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం సాధ్యం కాని పని. కానీ అందరికీ ఏదో పని కలిపించి ఆదాయమార్గాలను చూపించడం ఒక మంచి ప్రజా ప్రభుత్వం చేసే పని. వీలైనచోట్లల్లా ఉద్యోగాలతో పాటు, ప్రజా బాహుళ్యానికి వైద్య సౌకర్యం, రెసిడెన్షియల్ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తూ సీఎం కేసీఆర్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తెలంగాణ భౌగోళిక స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్న ప్రజానాయకుడు కాబట్టే వ్యవసాయ ప్రధానమైన వ్యవసాయాధారిత రాబడితో బతికేవాళ్ల సంఖ్య ఎక్కువ ఉన్నదని గ్రహించారు. వృత్తులు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న దేశంలో, రాష్ట్రంలో వృత్తి పనులను ప్రోత్సహించకుంటే మనుగడలేదన్న విషయాన్ని గ్రహించారు. అందుకే వ్యవసాయానికి ప్రథమ స్థానం ఇచ్చారు. వ్యవసాయం లాభసాటిగా కొనసాగడానికి ప్రాథమిక అవసరమైన నీటివసతి సమకూర్చడం అత్యవసరం అని గ్రహించారు. కాబట్టే గత ఐదేండ్లలో నీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ లక్షలాది ఎకరాలకు నీరందిస్తున్నారు. త్వరలో ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం కానున్నది. మిషన్ కాకతీయ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ సాగునీటి అవసరాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుతున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్. కులవృత్తుల ఆధారంగా జీవిస్తున్న ప్రజలకు చేయూతనందిస్తున్నారు. అందుకే కాపులు వ్యవసాయం చేస్తున్నారు. గొర్రెల, మేకలు, పశువుల పెంపకం ద్వారా పాలు, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు గొల్లకురుమలు. బెస్తలు, తెనుగులు చేపలు పడుతు న్నారు. గౌడ కులవృత్తుల వారు కల్లుగీస్తున్నారు. ఇలా ఆయా కులాల వారు తమ కులవృత్తులను చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఈ విధంగా ఆయా వృత్తుల వారి నైపుణ్యాన్ని గుర్తించి, వారికి ఉపాధి కల్పిం చడంతోపాటు గ్రామీణ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తున్నారు. పేదరికాన్ని పారదోలుతున్నారు.

పారిశ్రామీకరణ, ప్రపంచీకరణ లాంటి పలుమార్పుల వల్ల వీళ్ల ఆదా యమార్గాలైన వృత్తిపనులన్నీ మూలకుపడుతున్నాయి. కులవృత్తుల వారి కి ఆయా పనుల ద్వారా ఆదాయమార్గాలు పెరుగడానికి, వారి జీవనపరిస్థితులు మెరుగుపడటానికి ఆ వృత్తికి సంబంధించిన వస్తువులను, దుకాణాలను, జంతువులను, సామగ్రినిచ్చి బహుజన కులాల వారందరినీ ఆదుకుంటున్న బహుజన బంధువు కేసీఆర్. ఏ కులం వారైనా సరే, భూములుండి వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న వారందరికీ రైతుబం ధు ద్వారా ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసా యానికి ఊతమందిస్తున్నారు. అంతేకాకుండా ఏ కారణం చేతనైనా ఆ రైతు చనిపోతే రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమాను అందజే స్తూ ఆయా రైతుల కుటుంబాలను పెద్దబిడ్డగా ఆదుకుంటున్నారు. అంతే కాకుండా కులాలకతీతంగా ఆసరా పింఛన్లను అందిస్తూ వృద్ధులకు బాస టగా నిలుస్తున్నారు. అనేక కారణాల వల్ల  పద్మశాలీలకు ఉపాధి కరువైంది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్వాకానికి పద్మశాలీలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. వాళ్ల కుటుంబాలు  రోడ్డున పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవి ర్భవించగానే పద్మశాలీల కుటుంబాల్లో వెలుగులు నిండాయి.  వీరిని ఆదుకోవడానికి రాష్ట్రంలో చేనేత పరిశ్రమలు విరివిగా వెరిశాయి. పద్మశాలీలకు ఉపాధి పెరుగాలని చేనేత బట్టలనే వాడాలంటూ రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కేసీఆర్. టెక్ (నేత) పార్కులు ఏర్పాటుచే స్తూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించారు. ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరులుగల్ల సిరిసిల్లగా మార్చారు.తెలంగాణ దేశంలోనే అత్యధికంగా గొర్రెలు, మేకలున్న రాష్ర్టాల్లో రెం డవ స్థానంలో ఉన్నది. మన రాష్ట్రంలో వీటి ఆధారంగా బతికే గొల్లకురుమల సంఖ్య యాభై లక్షలకు పైనే ఉన్నది. దక్కన్ జాతి, నెల్లూరు జాతి గొర్రెలు, మేకలు ఇక్కడ బతికే అవకాశాలు ఎక్కువ. గొర్రెల పెంపకానికి అనువైన వాతావరణ పరిస్థితులు మన తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి గొల్లకురుమ యువకులకు ఉపాధినిస్తూ, వారి బతుకుల్లో వెలుగులు నిం పడానికి  ఒక్కో కుటుంబానికి రూ. లక్షా 25 వేల విలువ చేసే గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పుడు రాష్ట్రవాప్తంగా ఉన్నటువంటి గొల్లకురుమలు  సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు.

బీసీ కులాల్లో గణనీయంగా జనాభా ఉన్న బెస్తలు, ముదిరాజ్‌లు తమ తమ ఊర్లల్లో నిండుగా ఉన్న చెరు వుల్లో చేపలు పడుతున్నారు. గుట్ట ల్లో నాటిన హరితహారం మొక్కల కున్న పండ్లను అమ్ముతున్నారు. జల వనరులపై సాధికారత వీరికే. ఏ ఊళ్ళోనైనా చేపలు పట్టుకునే అధికారమూ వీరిదే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల్లో కోట్ల సం ఖ్యల్లో చేప పిల్లలను వదిలింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పిల్లలు ఇప్పుడు పెద్దగై ముదిరాజులను మురిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గౌడన్నలు నిరాదరణకు గురయ్యారు. తాటిచెట్ల నుంచి పడుతూ లేస్తూ జీవించారు. చనిపోయేవారు చనిపోయారు, బతికున్నవారు మంచాలకే పరిమితమయ్యారు. అలాంటి గౌడన్నల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.వారి పిల్లలు అనాథలయ్యారు. గౌడ వృత్తి నిరాదరణకు గురైంది. అట్లాంటి గౌడవృత్తి రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉరుకులు పెడుతున్నది. ఇప్పుడైతే ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా నీరా ముచ్చ టే. పట్నంలో నీరా పేరిట రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదంటే వారి సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ఎంత ఆసక్తి ఉన్నదో తెలుస్తూనే ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కులవృత్తులను చేరదీస్తూ, చేయూత నందిస్తూ సబ్బండ వర్ణాలకు అండగా నిలుస్తున్నారు. బహుజనులకు బం ధువవుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను చేరదీస్తున్నారు. ప్రతి ఎన్నికలో విజయాన్ని చేకూరుస్తున్నారు. అందుకే ఆత్మబంధువైన ఈ అధినాయకుడికి రాష్ట్రంలో ఎదురునిలువగల ప్రతిపక్ష నాయకుడే లేడంటే అతిశయోక్తి కాదు.


logo