సందేశంతో కేఎస్ 100

Sat,March 23, 2019 10:48 PM

సమీర్‌ఖాన్, శైలజ జంటగా నటిస్తున్న చిత్రం కెఎస్ 100. షేర్ దర్శకుడు. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నవనీత్‌చారి స్వరాల్ని అందించిన ఈ చిత్ర గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నేడు సమాజంలో అమ్మాయిలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. వారిలో ధైర్యాన్ని నింపుదామనే లక్ష్యంతో ఈ సినిమా తీశాను. చక్కటి సందేశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అన్నారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇదని దర్శకుడు తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు నవనీత్‌చారి పేర్కొన్నారు. వినూత్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు.

1376

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles