గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:10:49

22 మందికి వైద్యపరీక్షలు

22 మందికి వైద్యపరీక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వైరస్‌ అనుమానిత లక్షణాలున్నవారికి చేపట్టే నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గురువారం 22 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ వెలువరించింది. ఇప్పటివరకు 215 మందికి పరీక్షలు జరుపగా ఒకరికి మాత్రమే పాజిటివ్‌ నమోదైనదని పేర్కొన్నది. 215 మందిలో 169 మందికి వ్యాధి లక్షణాలు లేవని తేలిందని.. మరో 45 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నదని తెలిపింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం 3,740 మందికి థర్మల్‌స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 22,790 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసినట్లు వెల్లడించారు. 


logo