Forex Reserves | ఫారెక్స్ రిజర్వులు డౌన్.. వరుసగా రెండోవారం 2 బిలియన్ డాలర్లు తగ్గిన నిల్వలు
విదేశీ మారకం నిల్వలు మరింత పడిపోయాయి. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.282 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
Forex Reserves | ముంబై, ఏప్రిల్ 26: విదేశీ మారకం నిల్వలు మరింత పడిపోయాయి. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.282 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 5తో ముగిసిన వారంలో రిజర్వులు రికార్డు స్థాయి 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయి 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకం నిల్వలు మళ్లీ నాలుగేండ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు, పసిడి రిజర్వులు 1.01 బిలియన్ డాలర్లు ఎగబాకి 56.808 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ, ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 43 మిలియన్ డాలర్లు తగ్గి 18.034 బిలియన్ డాలర్లకు, అలాగే ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 2 మిలియన్ డాలర్లు తగ్గి 4.631 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
తీవ్ర ఒత్తిడిలో రూపాయి
ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా కనిష్ఠ స్థాయిలో జారుకుంటున్నది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ తెలిపింది. డాలర్‌తోపాటు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్లనే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

