ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 25, 2021 , 00:54:24

రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సంగక్కర

 రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సంగక్కర

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌..  శ్రీలంక బ్యాటింగ్‌ దిగ్గజం కుమార సంగక్కరను క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించింది. తన పదహారేండ్ల కెరీర్‌లో లంకకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన సంగక్కర సేవలు అందుబాటులోకి రావడం తమకు ఎంతగానో ఉపయోగ పడనుందని రాజస్థాన్‌ కొత్త కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లను వెతికిపట్టుకోవడం నుంచి వేలంలో అనుసరించాల్సిన వ్యూహాల వరకు సంగక్కర పర్యవేక్షణలో ముందుకెళతామని సంజూ అన్నాడు. 

VIDEOS

logo