సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 20, 2020 , 03:01:38

ఆలోచించి ఓటు వేయండి

ఆలోచించి ఓటు వేయండి
  • - టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
  • - నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారంనిర్మల్‌ టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి, ఆలోచించి ఓటు వేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు వేసినా అవి నిష్ప్రయోజనమే అని పేర్కొన్నారు.ఆదివారం నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌, కళానగర్‌ వార్డు లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కార్యకర్తలు స్వాగతం పలికారు.   సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లా ఏర్పడినప్పటి నుంచి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించడంతోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్‌ లైటింగ్‌, ఫోర్‌లైన్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు గండిరామన్న ఆలయం వద్ద హరితవనం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయమైందని, ఇక మెజార్టీ మిగిలిందన్నారు.పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయబోతుందన్నారు.  పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి. సత్యనారాయణగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఛైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు భూషన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఎర్రవోతు సురేందర్‌, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.logo