శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 01, 2021 , 18:51:47

డిమాండ్ల‌కు ఒప్పుకోకుంటే భారీ నిర‌స‌న ర్యాలీ: రైతు సంఘాలు

డిమాండ్ల‌కు ఒప్పుకోకుంటే భారీ నిర‌స‌న ర్యాలీ: రైతు సంఘాలు

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న‌ రైతుల డిమాండ్లు 50 శాతం నెర‌వేరాయ‌ని, జ‌న‌వ‌రి 4న జ‌రిగే భేటీలో రైతుల సందేహాలు పూర్తిగా ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఇటీవ‌ల కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను రైతు సంఘాల‌ను నేత‌లు ఖండించారు. త‌మ డిమాండ్లు 50 శాతం నెర‌వేరాయ‌న్న మంత్రి వ్యాఖ్య‌ల్లో నిజం లేద‌ని స్వ‌రాజ్ ఇండియా నేత యోగేంద్ర యాద‌వ్ పేర్కొన్నారు. 

త‌మ ప్ర‌ధాన డిమాండ్లైన‌ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు, క‌నీస మ‌ద్దతు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మై గ్యారంటీపై కేంద్రం ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్చ జ‌రుప‌లేద‌ని యోగేంద్ర‌యాద‌వ్ చెప్పారు. ఒక‌వేళ జ‌న‌వ‌రి 4న జ‌రిగే చ‌ర్చ‌ల్లో త‌మ డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించ‌క‌పోతే జ‌న‌వ‌రి 6న భారీ నిర‌స‌న ర్యాలీ నిర్వహిస్తామ‌ని హెచ్చ‌రించారు. కుంద్లి-మ‌నేస‌ర్‌-ప‌ల్వాల్ ల‌లో త‌మ ర్యాలీ జ‌రుగుతుంద‌ని తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo