శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 16:51:30

ఎవ‌రెస్ట్‌కు నో ఎంట్రీ

ఎవ‌రెస్ట్‌కు నో ఎంట్రీ

హైద‌రాబాద్‌: నోవెల్‌ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేపాల్‌లోని ఎవ‌రెస్ట్ శిఖ‌రంపైనా ప‌డింది. ఈ సీజ‌న్‌లో ప‌ర్వ‌తారోహ‌కుల‌కు ఎవ‌రెస్ట్‌ను మూసివేశారు.  నేపాల్ ప్ర‌భుత్వం ఇవాళ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ప‌ర్వ‌తారోహ‌ణ ఉండ‌ద‌ని నేపాల్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. చైనా ఆధీన ప్రాంతం నుంచి ఎవ‌రెస్ట్‌ను అధిరోహించే ప‌ర్వ‌తారోహ‌కుల‌కు ఇప్ప‌టికే అనుమ‌తి ఇవ్వ‌డంలేదు. ఎవ‌రెస్ట్ ప‌ర్మిట్లు ఇవ్వ‌డం వ‌ల్ల నేపాల్‌కు ప్ర‌తి ఏడాది సుమారు నాలుగు మిలియ‌న్ల డాల‌ర్లు వ‌స్తాయి.  

తాజా నిషేధంతో ఆ దేశం కీల‌క‌మైన ప‌ర్యాట‌క ఆదాయాన్ని కోల్పోనున్న‌ది.  ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు టూరిస్టు వీసాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు పీఎంవో కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ప్ర‌సాద్ బిదారి తెలిపారు.  2020 సీజ‌న్‌కు జారీ చేసే ప‌ర్మిట్ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు చెప్పారు. నేపాల్‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. సాధార‌ణంగా అమెరికా, ఇండియా, చైనా, బ్రిట‌న్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా దేశాల నుంచి ఆదాయం వ‌స్తుంది. 


logo