GT vs CSK : చావోరేవో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓపెనర్లు సాయి సుదర్శన్(92), కెప్టెన్ శుభ్మన్ గిల్(85)లు బాదేస్తున్నారు. పోరాడితే పోయోదేమీ లేదనట్టు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) బౌలర్లను ఉతికారేస్తున్నారు.
అచ్చొచ్చిన మైదానంలో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీ సాధించారు. వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో గుజరాత్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెడుతోంది. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 179/0.