Arvind Kejriwal | తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్.. 50 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు రాక
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్‌కు ఆయన భార్య సునీత, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.
కాగా, మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం సుమారు 50 రోజులు తీహార్ జైలులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. బెయిల్ సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లవద్దని, ఎలాంటి ఫైల్స్‌పై సంతకాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించిగానీ, ఆ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణల గురించిగానీ కేజ్రీవాల్ ఎలాంటి ఆరోపణలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులను కలవకూడదని, వారితో మాట్లాడకూడదని చెప్పింది. జూన్ 2న జైల్లో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.
#WATCH | Delhi CM Arvind Kejriwal released from Delhi's Tihar Jail after being granted interim bail in Delhi excise policy case
The Supreme Court granted him interim bail till June 1. pic.twitter.com/Qw80ugnehO
— ANI (@ANI) May 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

