PM Modi | పట్నా, మే 19: ప్రధాని మోదీకి ఓటేయవద్దని పిల్లలకు చెప్పిన ఓ స్కూల్ టీచర్‌కు ఊహించని షాక్ తగిలింది. బీహార్ ముజఫర్‌పూర్‌లో పోలీసులు స్కూల్ టీచర్‌ను అరెస్టు చేసి.. జైలుకు పంపారు. ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించాడంటూ జిల్లా విద్యాధికారి ఫిర్యాదు చేయగా, సదరు టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
‘కుర్హాని బ్లాక్‌లోని అమ్రాఖి ప్రభుత్వ స్కూల్లో టీచర్ హరేంద్ర రాజక్పై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ అధికారిగా ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు టీచర్ ప్రయత్నించాడని డీఈవో అన్నారు. అతడిపై చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.