Ebrahim Raisi | ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు.. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాద స్థలం గుర్తింపు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (IRCS) తెలిపింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్థలాన్ని కనిపెట్టినట్లు పేర్కొంది.
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (IRCS) తెలిపింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్థలాన్ని కనిపెట్టినట్లు పేర్కొంది. అయితే అంతకుముందు కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్లను మానవరహిత విమానం (UAV) కనుగొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే అక్కడ ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవని తెలిపింది. కాగా, తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 73 రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండటం, దట్టమైన పొగమంచుతో అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉన్నది.
కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని టర్కీకి చెందిన అకింజి అనే యూఏవీ గుర్తించింది. అది హెలికాప్టర్ కూలిన ప్రాంతమేనని అనుమానిస్తున్నారు. దీనిని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ ధ్రువీకరించారు. అయితే ఇప్పటివరకు అధ్యక్షుడు రైసీ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించిన విషయం తెలిసిందే.
అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్ కూలినట్టు తెలిపింది. భారీ పొగమంచు మధ్య పర్వతప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ కుప్పకూలిందని ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని, అధ్యక్షుడు రైసీ సహా ఇతరులు క్షేమంగా ఉన్నారన్నదానిపై అనుమానాలున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. ఆ హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్, అజర్ బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలిసింది. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని, భారీ వర్షం, మంచు కురవటంతో సహాయక చర్యలు ముందుకు కదలటం లేదని ఇరాన్ హోంమంత్రి వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెగ్యులర్ టీవీ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిలిపివేసింది.
ఎవరీ ఇబ్రహీం రైసీ?
ఇరాన్లో మతతత్వ పాలనకు గట్టి మద్దతుదారుగా రైసీ నిలిచారు. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఆయనకు వారసుడిగా రైసీ గుర్తింపు పొందారు. 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయన ఆంక్షల్ని ఎదుర్కొంటున్నారు. గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపారు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థులందర్నీ పక్కకు తప్పించి, తక్కువ ఓటింగ్‌తో రైసీ గెలుపొందటం వివాదాస్పదమైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నైతిక చట్టాల్ని కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేశారు.
Iran’s Press TV tweets, “Rescue teams identify President Ebrahim Raisi’s crashed chopper…No clue of any living persons in President Raeisi’s search following Sunday chopper crash.”
— ANI (@ANI) May 20, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

