హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం బుధవారం 20 మంది ఐపీఎస్ అధికారులను బది లీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు.
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, గో లొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్ల ను కలుపుతూ సౌత్రేంజ్ను ఏర్పాటు చేశారు. దీనికి అడిషనల్ కమిషనర్ ఎల్అండ్ఓగా తఫ్సీర్ ఇక్బాల్‌ను నియమించారు. ఎన్.స్వేతా ఐపీఎస్‌ను నార్త్‌జోన్ రేంజ్ (జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్) హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా నియమించారు. ఇక మలాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, ఎల్.బి.నగర్ వంటి కీలక ప్రాంతాలకు కొత్తగా డీసీపీలను నియమించారు. అలాగే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ జోన్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు.