Devara | అగ్గంటుకుంది సంద్రం.. ఆ గుండె మండే ఆకసం..
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులోని ఎన్టీయార్ కేరక్టరైజేషనే ఈ పాట. తారక్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఈ పాటను మలిచారు దర్శకుడు కొరటాల శివ.
Devara | ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులోని ఎన్టీయార్ కేరక్టరైజేషనే ఈ పాట. తారక్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఈ పాటను మలిచారు దర్శకుడు కొరటాల శివ. మాస్ ప్రేక్షకులకు విందుభోజనం లాంటి సినిమాగా ‘దేవర’ తెరకెక్కుతున్నదని ఈ పాట చూస్తే అర్థమవుతుంది. ‘అగ్గంటుకుంది సంద్రం.. ఆ గుండె మండే ఆకసం.. అరాచకాలు భగ్నం.. చల్లారే చెడు సాహసం..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, అనిరుథ్ రవిచంద్రన్ స్వరపరిచి, ఆలపించారు.
ఇందులోని హీరో గుణగణాలను, వీరత్వాన్ని తన సాహిత్యంతో అద్భుతంగా ఆవిష్కరించారు గీత రచయిత రామజోగయ్యశాస్త్రి. ఇక అనిరుథ్ సంగీతం మాస్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. వెన్నెల్లో అందంగా కనిపించే సముద్రాన్ని రక్తసిక్తంగా చూపిస్తూ, తెగిపడిన శరీర భాగాలతో, దారుణమైన మారణాయుధాలతో ఆద్యంతం పోరాటాలతోనే ఈ పాట సాగింది. ఎన్టీయార్ మాస్ అవతార్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

