ఆదివారం 05 జూలై 2020
International - Jun 15, 2020 , 09:18:02

బీజింగ్‌లో జోరుగా టెస్టింగ్‌.. అధికారుల‌ తొల‌గింపు

బీజింగ్‌లో జోరుగా టెస్టింగ్‌.. అధికారుల‌ తొల‌గింపు

హైద‌రాబాద్‌: బీజింగ్‌లో జిన్‌ఫాది మార్కెట్‌తో లింకున్న ప్ర‌తి ఒక్క‌ర్ని ట్రేస్ చేసి మ‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. జిన్‌ఫాది మార్కెట్‌లో ఇటీవ‌ల 46 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఒక్క‌సారిగా కేసుల సంఖ్య పెర‌గ‌డంతో .. బీజింగ్ అధికారులు త‌క్ష‌ణ‌ చ‌ర్య‌లు చేప‌ట్టారు.  ఇప్ప‌టికే ఆ న‌గ‌రంలో 76,499 మందికి న్యూక్లియిక్ యాసిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దాంట్లో 59 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది.  జిన్‌ఫాది మార్కెట్‌కు వ‌చ్చి వెళ్లిన వారి కోసం ఇంకా ట్రేసింగ్ కొన‌సాగుతున్న‌ది. గ‌త 14 రోజుల్లో ఆ మార్కెట్‌కు వెళ్లి వ‌చ్చిన 29386 మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. అయితే దాంట్లో అంద‌రికీ నెగ‌టివ్ వ‌చ్చిన‌ట్లు చైనా అధికారులు చెప్పారు. 

బీజింగ్‌లోని హైదియాన్ జిల్లాలోని మార్కెట్‌తో లింకు ఉన్న సుమారు ప‌ది కాల‌నీల‌ను కంటేయిన్ చేసిన‌ట్లు స‌మాచారం. జిన్‌ఫాది మార్కెట్‌తో సంబంధాలు ఉన్న హైదియాన్ మార్కెట్ స్టాఫ్‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కొత్త‌గా కేసులు న‌మోదు కావ‌డంతో.. చైనాలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌వ‌రం మొద‌లైంది. కోవిడ్‌19 నివారణ చ‌ర్య‌ల్లో విఫ‌ల‌మైన ప‌లువురి అధికారుల‌పై చైనా చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ఫెంగ్‌తాయి జిల్లా స్థాయి అధికారితో పాటు మ‌రికొంత  మంది ప్ర‌భుత్వ అధికారుల‌ను తొల‌గించారు.


జిన్‌ఫాది.. బీజింగ్‌లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. అక్క‌డ పండ్లు, కూర‌గాయ‌లు, మాంసం అమ్ముతారు. అయితే కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జిన్‌ఫాది మార్కెట్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చిన ఫెంగ్‌తాయి మార్కెట్‌లోనూ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఫెంగ్‌తాయి మార్కెట్ అధికారుల‌ను తొల‌గిస్తూ చైనా ఆదేశాలు జారీ చేసింది.logo