మంగళవారం 31 మార్చి 2020
International - Feb 27, 2020 , 10:10:14

అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

అమెరికా: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో, మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ కంపెనీలోకి చొరబడిన ఓ 51 ఏళ్ల వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో నిందితుడు సహా ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం, కాల్పులకు సంబంధించిన విషయం తెలిసి, పోలీసులు ఖంగుతిన్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు సంస్థ మాజీ ఉద్యోగిగా వారు గుర్తించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే నిందితుడు.. కాల్పులకు తెగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో ఉద్యోగి ఐడీ కార్డు దొంగిలించి, కంపెనీలోకి దూరిన నిందితుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 


logo
>>>>>>