శనివారం 06 జూన్ 2020
Cinema - May 12, 2020 , 08:30:13

అమితాబ్ బ‌చ్చ‌న్ 'డాన్'‌కి 42 ఏళ్ళు

అమితాబ్ బ‌చ్చ‌న్ 'డాన్'‌కి 42 ఏళ్ళు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన ఆణిముత్యాల్లాంటి సినిమాల‌లో డాన్ ఒక‌టి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని చంద్ర బ‌రోత్ తెర‌కెక్కించ‌గా, న‌రీమ‌న్ ఇరాని నిర్మించారు. అమితాబ్ , జీన‌త్ అమ‌న్‌, ప్రాన్‌,ఇఫ్తీక‌ర్‌, హెల‌న్‌, ఓమ్ శివ‌పురి, స‌త్తేన్ క‌ప్పు, మ‌క్ మోహ‌న్, యూసుఫ్ ఖాన్, పించు క‌పూర్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. క‌ల్యాణీ ఆనంద్‌జీ సంగీతం అందించారు. 

డాన్ చిత్రంలో అమితాబ్ ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించారు.బాంబే అండర్ వరల్డ్ బాస్ డాన్ మరియు  విజయ్ అనే పాత్రల‌లో అల‌రించారు. ఈ చిత్రం యొక్క కథాంశం బొంబాయి మురికివాడతో పాటు విజయ్ చుట్టూ తిరుగుతుంది. రెండు పాత్ర‌ల‌లో అమితాబ్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌చే ఈల‌లు వేయించారు.  డాన్ చిత్రం 1978 లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ భారతీయ చిత్రం కాగా  దీనిని బాక్స్ ఆఫీస్ ఇండియా బంగారు జూబ్లీగా వర్గీకరించారు. దీనిని ప్రేర‌ణ‌గా తీసుకొని  జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ అక్తర్ డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006) , దీని సీక్వెల్ డాన్ 2 (2011) ను రీమేక్ చేసాడు. ఈ రెండింటిలో షారుఖ్ ఖాన్ నటించారు.

మే 12,1978లో విడుద‌లైన డాన్ చిత్రం నేటితో 42 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అమితాబ్ బ‌చ్చ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా డాన్ జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నారు. బెస్ట్ యాక్ట‌ర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న‌ట్టు తెలిపిన బిగ్ బీ..సినిమా రిలీజ్‌కి ముందు నిర్మాత‌ని కోల్పోయాము. నాకు వ‌చ్చిన అవార్డుని న‌రిమ‌న్ ఇరానీ భార్యకి అంకితం చేసానని చెప్పుకొచ్చారు logo