Viral News | స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్సుల్లో జంట షికారు..! పోలీసులు ఏం చేశారంటే..!
Viral News | ప్రేమికులు బైకులపై విహరిస్తూ స్టంట్స్ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్ షికారుకు వెళ్లింది.
Viral News | ప్రేమికులు బైకులపై విహరిస్తూ స్టంట్స్ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్ షికారుకు వెళ్లింది. ఈ విషయం గమనించిన పోలీసులు జంటను అరెస్టు చేశారు. అలాగే, భారీగానే చలాన్స్ జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నజాఫ్‌గడ్‌కు చెందిన ఆదిత్య వర్మతో పాటు ఓ యువతితో కలిసి స్పైడర్ మ్యాన్ నజాఫ్ గఢ్ పార్ట్-5 పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు బైక్ రైడింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, కొత్తగా ఉండాలని స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్‌లా డ్రెస్ వేసుకొని బైక్‌పై ఢిల్లీ వీధుల్లో షికారు కొట్టారు. సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు వాయువ్య ఢిల్లీలోని ద్వారాక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చాయి. జంటను అదుపులోకి తీసుకున్నారు.
ఎంవీఐ యాక్ట్ కింద జరిమానా విధించి వదిలేశారు. నంబర్ ప్లేట్‌లేని బైక్ నడపడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చలాన్లు జారీ చేశారు. అయితే, ఆదిత్య వర్మకు ఇలాంటివి కొత్తవేమీ కాదు. ఇండియన్ స్పైడీ పేరుతో వీడియోలు చేస్తూ వచ్చాడు. స్పైడీ బ్యాడ్మింటన్, ట్రాక్టర్ నడుపుతూ, ట్రెండింగ్ సాంగ్స్ డాన్స్ చేస్తూ వస్తున్నాడు. కాలేజీ వేడుకల్లో జరిగే స్పాట్ ప్రదర్శనలు సైతం ఇస్తూ వస్తుంటాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

