గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 12, 2020 , 00:23:32

అర్హులందరూ ఓటు హక్కును కలిగి ఉండాలి

అర్హులందరూ ఓటు హక్కును కలిగి ఉండాలి

తుర్కపల్లి : 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్‌ సలీమొద్దీన్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు తుర్కపల్లి, వాసాలమర్రి తదితర గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని ఓటురు నమోదు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మండలంలో శని, ఆదివారాలు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటుచేసి 18సంవత్సరాలు నిండి ఓటు హక్కులేని యువతియువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీవో శ్రీమాలిని, సర్పంచ్‌ యాట పోషమణి పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి రమణరెడ్డి, వీఆర్వో హరినాథ్‌ తదితరులు ఉన్నారు.

VIDEOS

logo