Summer | రాష్ట్రంపై ‘నిప్పుల వాన’.. మరో ఐదు రోజులు తీవ్ర వడగాడ్పులు
భగభగలాడుతున్న వేసవి భానుడు శుక్రవారం రాష్ట్రంపై ‘నిప్పుల వాన’ కురిపించాడు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతో ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
- జమ్మికుంటలో అత్యధికంగా 45.6 డిగ్రీలు
- పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు
- 28-30 మధ్యన పలు జిల్లాల్లో వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
Summer | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): భగభగలాడుతున్న వేసవి భానుడు శుక్రవారం రాష్ట్రంపై ‘నిప్పుల వాన’ కురిపించాడు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతో ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6, నల్లగొండ జిల్లా నిడమనూర్, పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2, యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల, కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా వెల్లటూర్, కాల్వాయి, నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.1, నల్లగొండ జిల్లా మాటూర్‌లో 45, కానాయిపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.
జిల్లాలవారీగా భద్రాద్రి కొత్తగూడెంలో 43.5, నిజామాబాద్‌లో 43.4, నల్లగొండ, ఖమ్మం, రామగుండంలో 43, మహబూబ్‌నగర్, మెదక్‌లో 42.5, ఆదిలాబాద్‌లో 42.3, హనుమకొండలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. రానున్న ఐదు రోజులు పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 30న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నది.
వర్ష సూచన
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. 28న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేరొంది. 29న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

