శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jan 23, 2020 , 02:22:01

మున్సిపోల్ సరళి పరిశీలన

మున్సిపోల్ సరళి పరిశీలన
  • - నర్సంపేటలో రాష్ట్ర అబ్జర్వర్ పరిశీలిన




నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేటలోని పోలింగ్ సరళిని స్టేట్ అబ్జర్వర్ సువర్ణపండాదాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే తీరును పరిశీలించారు. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించామని చెప్పారు. పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతున్నదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వివరరించారు. ఓట్లర్లు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనించారు. ముందు జాగ్రత్తగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో  టెంట్లు  వేశారు. దీంతో పాటు ఓటర్లకు తాగునీటిని కూడా సమకూర్చారు. ఓటర్లకు భోజన సదుపాయాలను కల్పించారని తెలిపారు. ఒక్కో బూత్ ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసుకున్నారు. పలు బూత్ ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు.

ఇబ్బందులు ఏమైనా ఉన్నాయాని పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సజావుగా పోలింగ్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏర్పాటు చేసి భద్రతను ఆయన చూశారు. ఎస్సైలు, సీఐల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉన్నారు.  ఓటర్ల శాతం ప్రతి రెండు గంటల కోసారి నమోదు చేయాలని సూచించారు. సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు పోలింగ్ శాతం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు.  దీనికోసం అవసరమైన సూచనలు, సలహాలను ఆయన ఇచ్చారు. అధికారులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. లోపలికి ఎవ్వరిని అనుమతించొద్దని, ఓటర్లను మాత్రమే స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్ హరిసింగ్, ఏసీపీ ఫణీందర్, ఎన్నికల అధికారి తోట శ్రీనివాసరావు, సీఐ కరుణసాగర్ ఎస్సై యుగంధర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

47 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు : కలెక్టర్ హరిత..

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని 47 వార్డుల్లో  మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లు  కలెక్టర్ హరిత తెలిపారు. వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ బూత్ వెల్లి పీవో, ఏపీవోలతో మాట్లాడారు. జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట, నర్సపేట మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు మున్సిపాలిటీల పరిధిలో 47 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 11 వార్డులు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు.  మూ డు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన సమస్యాత్మక కేం ద్రాల వద్ద ప్రత్యేకంగా పోలీసులను నియమించి ప్రశాతంగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ యంత్రాం గం ద్వారానే ఓటర్లకు ఓటరు స్లిప్పులను అందించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లు ఓటరు స్లిప్పుతో పాటుగా తప్పకుండా ఏదైనా గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రాలను తీసుకొని రావలసి ఉంటుం ది. స్థానికంగా ఉండేవారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాలలో కుటుంబ పోషణ కోసం వెళ్లి ఓటు వేసేందుకు వచ్చేవారితో కొంత సమస్య ఏర్పడుతుంది. దీనివల్లనే గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాల్సి వస్తుంది.  జిల్లాలో 33 పోలింగ్ కేంద్రాలలో వెబ్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహణ చేయడం జరిగింది. బుధవారం జిల్లాలో ఎలాంటి సంఘటనలు ఇంత వరకు జరగలేదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు ఓటింగ్ శాతాన్ని తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణనలో ఎన్నికల అధికారులు, పీవోలు, ఏపీవోలు, పోలీస్ అధికారులు నిత్యం అప్రమతంగా ఉంటూ ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా పనిచేస్తున్నారని కలెక్టర్ హరిత తెలిపారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ ..

వర్ధన్నపేటలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ పరిశీలించారు. ఉదయం వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇదే పాఠశాలలోని నూతన భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ఆయన పరిశీలించారు. అలాగే బ్యాలెట్ బాక్స్ భద్రపరిచే గదులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన ఏసీపీ రమేశ్, సీఐ విశ్వేశ్వర్ ద్వారా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బందోబస్తు విషయాన్ని తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అప్రమత్తంగా బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ తరలించాలని అన్నారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ నిత్యం ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన ఏసీపీకి సూచించారు. ఆయన వెంట సర్కిల్ పరిధిలోని ఎస్ అధికారులు ఉన్నారు.


logo