శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 09:25:40

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా

హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌, సెక్యూరిటీ గార్డు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. కరోనా లక్షణాలు కన్పించడంతో దవాఖానలో పనిచేస్తున్న తొమ్మిది మంది రక్తనమూనాలను బుధవారం సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు పంపించారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 

దీంతో వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రభును కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు, సిబ్బంది తప్పనిసరిగా వ్యక్తిగత భద్రత పాటించాలని చెప్పారు.


logo