మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 22:23:21

క్రిస్‌గేల్‌ ఔట్‌..పోరాడుతున్న రాహుల్‌

క్రిస్‌గేల్‌ ఔట్‌..పోరాడుతున్న రాహుల్‌

దుబాయ్:‌  ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 177 పరుగుల  ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టార్గెట్‌ దిశగా సాగుతోంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విధ్వంసకర   ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ బౌండరీలతో చెలరేగారు.   పవర్‌ప్లేలో పంజాబ్‌ 51/1తో నిలిచింది.  బుమ్రా వేసిన 4వ ఓవర్లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ బౌల్డ్‌ అయ్యాడు.  ఈ సమయంలో గేల్‌, రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించారు. రాహుల్‌ చాహర్‌ వేసిన పదో ఓవర్‌ మొదటి బంతికి భారీ షాట్‌  ఆడిన గేల్‌ బౌండరీలైన్‌ వద్ద బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు.   10 ఓవర్లకు పంజాబ్‌ రెండు వికెట్ల  నష్టానికి 87   పరుగులు చేసింది. రాహుల్‌(38),  నికోలస్‌ పూరన్‌(11) క్రీజులో ఉన్నారు.  


logo