Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకంపై గెలుస్తుందనుకున్న బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ (Lovlina Borgohain) నిరాశపరిచింది. క్వార్టర్ ఫైనల్లో అదరగొడుదనుకుంటే ప్రత్యర్థి పంచ్‌ల ముందు తేలిపోయి ఇంటిదారా పట్టింది. 75 కిలోల విభాగంలో చైనా బాక్సర్ లి కియాన్ (Li Qian) చేతిలో లవ్లీనా 1-4తో దారుణంగా ఓడింది. దాంతో, విశ్వ క్రీడల్లో వరుసగా రెండో మెడల్ సాధించాలనుకున్న ఆమె కల కల్లలు అయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో కంచు మోత మోగించిన లవ్లీనా అంచనాలను అందుకోలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్‌కు దీటుగా బదులివ్వలేక చేతులెత్తేసింది. ఆసియా క్రీడల చాంపియన్ అయిన కియాన్ తొలి రౌండ్లో లవ్లీనాపై 3-2తో పైచేయి సాధించింది. అనంతరం రెండో రౌండ్లోనూ చైనా బాక్సర్ దూకుడుగా ఆడింది. అయితే.. పాయింట్ల అంతరాన్ని తగ్గించేందుకు లవ్లీనా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
Lovlina goes down fighting against reigning Asian Champion Qian #PunchMeinHaiDum#Paris2024#Cheer4Bharat#Boxing pic.twitter.com/yxn4aspIS3
— Boxing Federation (@BFI_official) August 4, 2024
చివరి రౌండ్లో 4-1తో ఆధిక్యంలో నిలిచిన కియాన్‌ను జడ్జిలు విజేతగా ప్రకటించారు. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీతో పాటు బాక్సింగ్‌లోనూ భారత బృందం పోరాటం ముగిసింది. లవ్లీనా కంటే ముందు బాక్సర్లు జాస్మినే లంబోరియా, ప్రీతి పవార్, నిఖత్ జరీన్, అంతిమ్ పంగల్, నిషాంత్ దేవ్‌లు ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే.