iPhone 17 Pro Max | వాలెంటైన్స్ డే ఆఫర్.. భారీ తగ్గింపు ధరకు లభిస్తున్న ఐఫోన్ 17 ప్రొ మాక్స్..
వాలెంటైన్స్ డే కి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ రోజున చాలా మంది తమకు ఇష్టమైన వారికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు తమకు నచ్చిన వారికి ఫోన్ ను బహుమతిగా ఇవ్వాలని అనుకుంటారు లేదా ఉన్న ఫోన్ ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటారు.
iPhone 17 Pro Max | వాలెంటైన్స్ డే కి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ రోజున చాలా మంది తమకు ఇష్టమైన వారికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు తమకు నచ్చిన వారికి ఫోన్ ను బహుమతిగా ఇవ్వాలని అనుకుంటారు లేదా ఉన్న ఫోన్ ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఈ సమయం సరైనదని చెప్పవచ్చు. ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఆలోచిస్తున్న ప్రీమియం ఫోన్ లలో ఐఫోన్ 17 ప్రొ మాక్స్ ఒకటి. ఈ ఫోన్ కు దాని ఫీచర్ల కారణంగా ఎంతో హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ హైప్ ను కొనసాగిస్తూనే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫోన్ ధరను తగ్గించారు. ఐఫోన్ 17 ప్రొ మాక్స్ తగ్గింపు ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్..
ఐఫోన్ 17 ప్రొ మాక్స్ 256 జీబీ మోడల్ ప్రస్తుతం మనకు అమెజాన్ లో దాదాపు రూ. 1,49,000 ధరకు లభిస్తోంది. అలాగే కొన్ని డిస్కౌంట్స్ ను కూడా దీనిపై అందిస్తున్నారు. కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కెడ్రిట్ కార్డ్ ను ఉపయోగించి దాదాపు రూ.7,495 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీనితో పాటు కొనుగోలుదారులు ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎంచుకున్న ఫోన్ లకు దాదాపు రూ. 48,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. మంచి కండిషన్ లో ఉన్న ఐఫోన్ 15పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో దాదాపు రూ. 32, 150 వరకు పొందవచ్చు. దీని వల్ల ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ధర మరింత తగ్గుతుంది.
ఫీచర్లు ఇవే..
ఇక ఐఫోన్ 17 ప్రొ మాక్స్ ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ పనితీరు, డిస్ప్లేపై యాపిల్ ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇందులో 6.9 ఇంచుల Super Retina XDR OLED డిస్ప్లే తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. దీని వల్ల స్క్రోలింగ్, యానిమేషన్ స్మూత్ గా కనిపిస్తాయి. ఈ ఫోన్ లో Apple A19 Pro చిప్ ఉండగా, దానికి 12GB RAM ను అందిస్తున్నారు. ఇది భారీ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం రూపొందించబడింది. అంతేకాకుండా స్టోరేజ్ ఆప్షన్లు 256GB, 512GB, 1TB వరకు ఉన్నాయి.
ఫోన్ వెనుక భాగంలో మూడు 48MP కెమెరాలు మెయిన్, అల్ట్రా వైడ్, జూమ్ షాట్స్ కోసం ఇచ్చారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ USB-C చార్జింగ్, MagSafe, 5G సపోర్ట్, Wi-Fi 7, Face ID, అలాగే IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కూడా కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ లేటెస్ట్ iOS వెర్షన్ తో వస్తుంది కనుక దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్ లభిస్తుంది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 17 ప్రొ మాక్స్ ధరను తగ్గించారు కనుక ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు ఐఫోన్ ను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

