హైదరాబాద్ : నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి, గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.
నాసిరకం భోజనం పెడుతున్నారని అన్నం గిన్నెలను రోడ్డు మీద కొట్టి నిరసన తెలిపిన గురుకుల విద్యార్థులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డుపై విద్యార్థుల ధర్నా
అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి,… pic.twitter.com/lkGqILHIUH
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026