సింగరేణి సంస్థ చైర్మన్ ( Singareni Chairman ) , ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ (Jyoti Buddha Prakash ) గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధ ప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు , సామాజిక సంక్షేమంలో విస్తృత అనుభవం ఆయనకు ఉంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల కమిషనర్ , ఇన్స్పెక్టర్ జనరల్, సర్వే సెటిల్మెంట్లు అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ , భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.