Errabelli Dayakar Rao | పర్వతగిరి, వర్ధన్నపేట,రాయపర్తి, పెద్దవంగర, తొర్రూరు మండలం : ఎస్సారెస్పీ కాలువ ద్వారా మైలారం రిజర్వాయర్ అలాగే రాయపర్తి, తొర్రూరు మండలాల చెరువులకు సాగు నీరు అందించాలని, కండ్ల ముందే వందల ఎకరాలు సాగు చేయకుండా పొలాలను రైతులు పక్కన పెట్టిన, అలాగే వరి సాగు వేసిన వారికి సాగు నీరు అందక ఎండిపోతున్న కూడా ఈ ప్రభుత్వానికి సాగు నీరు విడుదల చేసి ఆదుకోవాలనే చిత్త శుద్ది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి.దయాకర్ రావు మండిపడ్డారు. కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి పంట పొలాలకు సాగు నీరు అందించాలని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రైతులతో కలిసి ఎండిపోయిన SRSP కాల్వ వెంబడి నాంచారిటు మడూర్ వరకు సుమారు 10 కిలో మీటర్లు కాలువ వెంబడి పాద యాత్ర కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. వర్షాకాలంలో కాలువ వస్తుందనే ఆశతో రైతులు వరి నాట్లు వేశారని ఇప్పుడు నీరు రాకుంటే రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వరి నాట్లు వేసిన రైతుల పంటలు ఎండి పోయే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ప్రభుత్వం నీరు విడుదల చేయొద్దని తెలిపారు అని చెప్తున్నారు. రోజుకో సభ పేరు ప్రజల సొమ్ము గుల్ల చేసుడు తప్ప రైతులకు ఏమి చెయ్యాలో తెలియని వ్యక్తి సిఎం గా ఉండడం సిగ్గుచేటన్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు రైతులకు భారంగా మారాయని తెలిపారు.
రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, సాగునీరు అందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రైతు బంధు ఎగగొట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తుంది. యూరియా దొరకక, కరెంట్ కష్టాలతో ఇప్పటికే రైతులు ఆగం అవుతున్నారు. పంట రుణమాఫీ సరిగ్గా జరగక మోసపోయిన రైతులను మళ్ళీ రైతు భీమా ఎగగొట్టి మళ్ళీ రైతులను మోసం చేసే కుట్ర జరుగుతుంది. 14 తారీఖున రైతు భీమా ప్రీమియం చెల్లింపున కు గడువు ముగిసిన కనీసం ఈ ప్రభుత్వానికి సోయి లేదు.
పంటలకు నీళ్లిస్తే పంటలు పండి కెసిఆర్ పేరు వస్తుంది అని పండిన పంటకు బోనస్ ఇయ్యాల్సి వస్తుంది అని రైతుల పొట్ట కొట్టె ప్రయత్నం ఈ మోస పూరిత కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పటికై ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను ఆదుకొక పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే దృఢ సంకల్పంతో బాల్యవివాహాలు తగ్గాలని మేనిఫెస్టో లో పెట్టుకున్న కుటుంబ పెద్దగా ఆలోచించి కల్యాణ లక్ష్మి పథకం పెట్టింది కేసిఆర్ అయితే ఎన్నికల వేల లక్షతోపాటు తులం బంగారం అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకమే నిలిపి వేయాలని కుట్ర పన్నుతుంది.
అందులో భాగంగానే హైకోర్ట్ లో కల్యాణ లక్ష్మి పథకంపై స్టే విధిస్తే 4 వారాలైన కనీసం కౌంటర్ కూడా వేయలేని స్థితి లో ఈ ప్రభుత్వం ఉంది కల్యాణ లక్ష్మి పథకం అమలు అయితే కెసిఆర్ గారికే పేరు వస్తుంది మళ్లీ మహిళలు తులం బంగారం అడుగుతున్నారని ఈ పథకమే లేకుంటే బాగుంటుంది అని ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది. కేసీఆర్ కిట్టు,కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కొనసాగిస్తూ తులం బంగారం ఇవ్వకపోతే మహిళలే తన్ని తరుముతారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వరంగల్, మహబూబాబాద్ జిల్లా నాయకులు, పర్వతగిరి, వర్ధన్నపేట,రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండల నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.