USA | అమెరికాలో ఓ బాద్యత గల పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు యువతి కందుల జాహ్నవి(23) అనే యువతి కుటుంబానికి న్యాయం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారిని విధులనుంచి తొలగించడంతో పాటు మృతురాలు కుటుంబానికి అక్కడి ప్రభుత్వం రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది.
2023 జనవరిలో సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన డేనియల్ అడరర్ అనే పోలీసు అధికారి కనీసం బాధ్యతగా ప్రవర్తించక పోగా ఎగతాలిగా మాట్లాడారు. “ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ ” అంటూ ఎగతాలిగా మాట్లాడాడు. కారుతో ఢీకొట్టి కనీసం పాశ్చాతాపం లేకండా వెకిలిగా ప్రవర్తించిన అధికారిపై సియాటెల్ నగర యంత్రాంగ చర్యలు తీసుకంది.
— Ashok Gajulaᵀᴹ (@KTRASHOKG) July 18, 2024