హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కార్ బకాయిపడ్డ ఆరు డీఏలను ఏక మొత్తంలో విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలోనూ ఆరు డీఏలు పెండింగ్లో లేవని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య పేర్కొన్నారు.
నిత్యావసరాల ధరలు పెరిగి ఉద్యోగులంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పశ్చిమబెంగాల్లో 38 శాతం డీఏను ఏక మొత్తంలో విడుదల చేశారని, ఇదే తరహాలో తెలంగాణలోను విడుదల చేయాలని కోరారు.